మంత్రి లోకేశ్ ఇవాళ(శుక్రవారం) ఉదయం 11 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్‌లో అర్థ సమృద్ధి ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. అక్కడ నుంచి 11.30 గంటలకు చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఏఐ ల్యాబ్స్‌ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన మీ కక్ష ఇంకా తీరలేదా జగన్ మోహన్ రెడ్డి అని ఐటీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా.. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని వీడియోను తెచ్చి అమరావతి అంటూ.. ఫేక్ ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అందరిదని, ఇక్కడ వివక్ష ఉండదని స్పష్టం చేశారు. ఇది బౌద్ధం పరిఢవిల్లిన నేల అని చెప్పుకొచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన ఆత్మీయ బంధంతో ప్రజలు కలిసి మెలిసి ఉంటారని వివరించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల కుంపట్లు, మతాల మధ్య మంటలు రేపి చలి కాచుకునే మీ కుతంత్రాలకు కాలం చెల్లిందని హెచ్చరించారు. కులాల కలహాలు రేపే కుట్రలు అమలుచేసిన మీ కిరాయి మూకల ఆటను చట్టం కట్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెనకుండి నడిపిస్తున్న మీరు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదని జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు.