Reliance AGM 2025 Mukesh Ambani: జియో ఐపీఓ సహా కొత్త యుగానికి రోడ్‌మ్యాప్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్‌ వ్యూహాలు, టెక్నాలజీ మార్పులు, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించి కీలక ప్రసంగం చేశారు.

బిజినెస్ న్యూస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) తన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)ను ఘనంగా నిర్వహించింది. ఈ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani ), జియో ప్లాట్‌ఫారమ్స్ అధ్యక్షుడు ఆకాష్ అంబానీ చేసిన ప్రకటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సమావేశం గణేష్ చతుర్థి సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో వాటాదారులకు ముఖేష్ అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జియో భవిష్యత్తు రోడ్‌మ్యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటిగ్రేషన్, ఆర్థిక ఫలితాల గురించి ప్రకటించారు.