Supreme Court Issues Notices: ఎస్టీ జాబితాలో లంబాడీ, సుగాలీ, బంజారాలు.. కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది.

హైదరాబాద్: లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చటంపై గతంలో తెలంగాణ హైకోర్టులో తెల్లం వెంకట్రావు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

లంబాడీ, సుగాలీ, బంజారాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మెరుగైన స్థానంలో ఉన్నారని పిటిషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల కోయ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.