మంత్రి పొంగులేటిని కలిసిన సీనియర్‌ జర్నలిస్టు తుమ్మలపల్లి ప్రసాద్

హైదరాబాద్‌`నవభూమి ప్రతినిధి

రెవెన్యూ,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నవభూమి తెలుగుదినపత్రిక స్టేట్‌ బ్యూరో తుమ్మలపల్లి ప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్రిడిడేషన్‌,ఎన్‌ప్యానెల్‌కు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలను చేపడతామని,జర్నలిస్టులకు అండగా నిలుస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌ డివి,ఆదిత్య స్కూల్‌ చైర్మన్‌ sudhakar తదితరులున్నారు.