అమరావతి, సెప్టెంబర్ 01 (నవభూమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై కించపరిచే విధంగా కథనం ప్రచురించిన నేపథ్యంలో సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడిటర్‌తో పాటు క్రైమ్ బ్యూరో చీఫ్, ఇతర సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.డీజీపీని లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేసిన కథనం ప్రచురణపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
