
చక్కని అందం,అభినయం ఉన్నా బిగ్ బాస్ భామ అషూరెడ్డికి మంచి బ్రేక్ రావడం లేదు. బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత టాలీవుడ్‌లో అవకా శాలు వస్తాయని ఈ భామ భావించింది. ఆశలు నిరాశలయ్యాయి. ఇక ఆర్జీవీని నమ్ముకుంది. ఆయన్ను చెంపదెబ్బ కొట్టి ఫేమ్ అవుతాదమని అనుకుంది. ఈ చెంపదెబ్బ సీన్ అయితే వైరల్ అయ్యింది కానీ, సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక సోషల్ మీడియాను నమ్ముకుంది. ఇన్‌స్టాలో అందాలు వెదజల్లుతూ యూత్‌ను విపరీతంగా అకట్టుకుంటుంది అషూరెడ్డి. టీవీషోలు చేయాలని ఉన్నా...అవకాశాలు రావడం లేదు. ఎక్కడ లోపం ఉందో తెలియదు కానీ,అషూరెడ్డికి కాలం కలిసి రావడం లేదు. అషూరెడ్డికి బ్యాడ్‌లక్ అని అభిమానులు వాపోతున్నారు.