మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం ఈ ఘటనలో ఇంకా శిధిలాల కింద పలువురు చిక్కుకున్నారని సమాచారం. ఈ ఘటనలో భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలు పాటించకుండా అక్రమ నిర్మాణం చేశారని ఫలితంగా ఇది కుప్పకూలింది అని మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిన్న అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
- Home
- Post