
హైదరాబాద్`నవభూమిబ్యూరో: లార్డ్ లంబోధరుడు ఖైరతాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. అశేష జనవాహిని మధ్య మహాగణపతి శోభాయాత్ర అట్టహాసంగా కొనసాగుతోంది. శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి రాజ్‌ధూత్ హోటల్,టెలిఫోన్ భవన్,సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. మహాగణపతిని చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా వచ్చారు. సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. మరికొద్ది సేపట్లో నిమజ్జనం జరుగుతుందనగా భక్తుల్లో ఉత్సాహం పెల్లుబికింది.గణపతి బొప్ప మోరియా..జై బోలో గణపతి మహరాజ్‌కీ
ఓ బొజ్జ గణపయ్య..నీ బంటు నేనయ్యా నంటూ నినాదాలు చేస్తూ భక్తులు సందడి చేశారు.