అడల్ట్‌ మూవీలో ’తమన్నా’

ఔన్నిజమే..తమన్నా అడల్డ్‌ కంటెంట్‌ ఉన్న మూవీలో నటించబోతుందట. టాలీవుడ్‌,బాలీవుడ్‌,మాలీవుడ్‌,సందల్‌వుడ్‌ రంగాలన్నీ ముక్కున వేలేసుకున్నాయట. వేషాల్లేవని ఓటీటీల్లో బోల్డ్‌గా నటించిన తమన్నా భాటియా ఇప్పుడు ఏకంగా అడల్డ్‌ కంటెంట్‌ ఉన్న మూవీలో యాక్ట్‌ చేయబోతోంది. ఇప్పుడు ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఇదే చర్చ.

ముంబై, సెప్టెంబర్ 9 (నవభూమి ప్రతినిధి):బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ ఏక్తా కపూర్ నిర్మాణంలో వచ్చిన హర్రర్ ప్రాంచైజీ *రాగిణి ఎం ఎం ఎస్* తిరిగి తెరపైకి రానుందని సమాచారం. 2011లో మొదటి భాగం, 2014లో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పుడు మూడో ఎడిషన్ సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.మొదటి భాగంలో కైనాజ్ మోతివాలా, రాజ్‌కుమార్ రావు నటన ఆకట్టుకోగా, రెండో భాగంలో సన్నీ లియోన్ గ్లామర్, భూషణ్ పటేల్ దర్శకత్వం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అప్పట్లోనే రాగిణి ఎం ఎం ఎస్ 2 మంచి హిట్టుగా నిలవడంతో సిరీస్‌లో మరిన్ని సినిమాలు చేయాలని ఏక్తా కపూర్ ఆలోచించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు *రాగిణి ఎం ఎం ఎస్ 3* స్క్రిప్ట్ పూర్తి కావడంతో బృందం హీరోయిన్ ఎంపికలో బిజీగా ఉందని తెలిసింది.మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నోరా ఫతేహీని ఎంచుకున్నారని సమాచారం. కథా చర్చలు కూడా జరిగాయి. కానీ చివరి దశలో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ కొత్త హీరోయిన్ కోసం ఏక్తా కపూర్ వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటి **తమన్నా భాటియా** పేరు బలంగా వినిపిస్తోంది.

సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఏక్తా కపూర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన తమన్నాను రాగిణి ఎం ఎం ఎస్ 3లో హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ ప్రస్తుతానికి చివరి దశలో ఉండగా, హీరోయిన్ ఎంపిక విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

తమన్నా ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్‌తో పాటు మంచి నటన చూపగల సామర్థ్యం ఉన్నందువల్లే రాగిణి ఎం ఎం ఎస్ 3కి సరైన ఎంపికగా మారవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ సిరీస్‌లో ఎప్పటిలాగే శృంగార సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి పాత్రలను తమన్నా ఈజీగా మలచగలదని ఫిలిం నగరంలో చర్చ నడుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్ట్‌తో తమన్నా హీరోయిన్‌గా ఫైనల్ అయితే, రాబోయే ఐదేళ్లపాటు ఆమె కెరీర్‌కు కొత్త ఊపు వస్తుందని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మాణ విలువలు, హర్రర్–థ్రిల్ మేళవింపు, కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ కలగలిపితే రాగిణి ఎం ఎం ఎస్ 3 కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.